Saturday, April 26, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్సేవలు యథావిధిగా కొనసాగించాలి..

రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్సేవలు యథావిధిగా కొనసాగించాలి..

పేదలకు న్యాయం జరగాలి.. ధర్మవరం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి ముసుగు మధు.
విశాలాంధ్ర- ధర్మవరం : రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) సేవలు యథావిధంగా కొనసాగించాలని పేదలకు న్యాయం జరగాలని ధర్మవరం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి ముసుగు మధు, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డిటి ఎఫ్సీఆర్ఎ రెన్యూవల్ పునరుద్దించేందుకు చర్యలు చేపట్టాలి అని తెలిపారు.కరువు పీడిత ప్రాంతాల్లో ఆర్థిటి కల్పతరువు అని,
1969లో విన్సెంట్ ఫెర్రర్,అన్నే ఫెర్రర్ దంపతులచే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) అనంతపురం జిల్లాలో స్థాపించబడిందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికం,బాధలు, అన్యాయాలను నిర్మూలించడానికి సమాన అవకాశాలు,సంపదను అందరికి అందించడానికి సంస్థను ప్రారంభించిందన్నారు
గ్రామీణ ప్రాంతాలలో సంస్థను ఏర్పాటు చేసి కరువు పీడిత ప్రాంతాల్లో ‘ఫుడ్-ఫర్-వర్క్ కార్యక్రమాన్నిప్రారంభించి, తద్వారావేలాదిగా బావులు తవ్వటం,లక్షలాది గృహాల నిర్మాణం,కుష్టు వ్యాధి కేంద్రం స్థాపన వంటి పనులు చేపట్టిందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభించి కూలీలను రైతులుగా మార్చడంలో సహాయపడిందన్నారు.
గ్రామీణ సమాజంలో పేదరికం,బాధలు,అన్యాయాలను తొలగించి,స్థిరమైన అభివృద్ధి ద్వారా సమాజాన్ని సాధికారపరచడం జరిగిందన్నారు.
మహిళలు,పిల్లలు,వైకల్యంఉన్నవ్యక్తులు,గిరిజన వర్గాల అభివృద్ధి కోసం ఆర్డిటి సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
విద్య, వైద్యం,గృహనిర్మాణం, స్థిరమైన జీవనోపాధి,సాంస్కతిక,
క్రీడా కార్యక్రమాల ద్వారా పేదల అభ్యున్నతికి తీవ్రంగా కృషి చేసిందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సౌకర్యాలను మెరుగుపరచడం, దానికి
మొబైల్ లైబ్రరీలు,ట్యూషన్ స్కూళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా స్కాలర్ షిఫ్ అందిస్తోందన్నారు.
బత్తలపల్లి, కల్యాణదుర్గం, కనేకల్లు లో రెండు సెకండరీ ఆసుపత్రులు, ఒక ప్రైమరీ హెల్త్కేర్ సెంటర్ స్థాపించిందని తెలిపారు. ఇక్కడ రోజువారీగా 3,000 మంది పేదవారు ఈ ఆసుపత్రుల సేవలను వినియోగించు కొట్టు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని తెలిపారు.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆదాయ ఉత్పత్తి, కార్యక్రమాలు,వృత్తి, శిక్షణలు,మహిళల భద్రత, సమానత్వం కోసం పలు కార్యక్రమాలు నిర్వహించింద
న్నారు. వైక్యల్యంతో బాధపడుతున్న వారి కోసం కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ సెక్టర్ స్థాపించి కృత్రిమ అవయవాలు,పునరావాస కేంద్రాలు,ఉపాధి అవకాశాలు అందిస్తోంద
న్నారు. వేలాది మంది రైతులకు మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలు అందించి, నీటి ఆదా,ఉత్పత్తి పెంపు సాధించిందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో గృహనిర్మాణం,రోడ్లు,తాగునీటిసౌకర్యాలు కల్పిస్తున్నద
న్నారు. 2012లో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ నుండి గృహ నిర్మాణంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపు లభించిందన్నారు.
ఫెర్రర్ మరణానంతరం ఆయన కుమారుడు మంచో ఫెర్రర్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందారన్నారు.
పేదల సంస్థగా పేరొందిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (అర్డిటి) నెత్తిన కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చిందన్నారు
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫిసిఆర్ఎ) కింద వివిధ దేశాల నుంచి ఆర్టీటీకి అందుతున్న సహాయానికి సంబంధించి రెన్యూవల్ పునరుద్ధరణను నిలిపివేయడాన్ని ఆయన ఖండించారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిధులే కాకుండా నేరుగా విదేశాల నుంచి నిధులు తెచ్చి, అనంతపురం జిల్లాతో పాటు రాయులసీమలోని అన్ని ప్రాంతాల్లో వెనకబడిన వర్గాల అభివృద్ధి కోసం మంచో ఫెర్రర్ కృషి చేస్తున్నారన్నారని తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంస్థ చేపట్టిన సేవలు ప్రస్తుతం ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు విస్తరించాయన్నారు.
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రాయలసీమ ప్రాంతంలో రాజకీయాల కతీతంగా పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు సమాయత్తమవుతున్నారని తెలిపారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి,ఆర్డిటి సంస్థకు వివిధ దేశాల నుండి అందే ఆర్థిక సహాయానికి సంబంధించిన ఎఫ్సీఆర్ఎ రెన్యూవల్ పునరుద్ధరించే విధంగా తగు చర్యలు చేపట్టాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు