Saturday, December 21, 2024
Homeఆంధ్రప్రదేశ్రైల్వే ప్రయాణికుల భద్రతే రైల్వే అధికారుల ముఖ్య లక్ష్యం..

రైల్వే ప్రయాణికుల భద్రతే రైల్వే అధికారుల ముఖ్య లక్ష్యం..

ఆల్ ఇండియా డి జి ఆర్ పి ఎఫ్ అధికారి మనోజ్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం:: రైల్వే ప్రయాణికుల భద్రతే రైల్వే అధికారుల యొక్క ముఖ్యముగా తమ విధులను కొనసాగించాలని ఆల్ ఇండియా డీజీ ఆర్పిఎఫ్ అధికారి మనోజ్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం ఆర్పిఎఫ్ సీఐ. బోయ కుమార్ పలు విషయాలను మీడియా ద్వారా తెలియజేప్పాలన్న కేంద్ర అధికారుల ఆదేశం మేరకు ప్రజలకు తెలియజేశారు. అనంతరం బోయ కుమార్ మాట్లాడుతూ ఢిల్లీ కేంద్ర రైల్వే అధికారుల ఆదేశాల మేరకు ఢిల్లీలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో గల ఆర్పిఎఫ్ జి ఆర్ పి డిజిపి లెవెల్ లోని అధికారులు అందరికీ కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రయాణికుల భద్రత, రైల్వే భద్రత, ప్రమాద రహిత రైల్వే స్టేషన్గా నిర్వహణ, రైల్లో సురక్షిత ప్రయాణం, దేశవ్యాప్తంగా జరిగిన నేరాలను ఎలా అదుపు చేయాలన్న పలు అంశాలపై పూర్తి వివరణతో తెలియజెప్పడం జరిగిందన్నారు. ఢిల్లీలో ఐదవ ఆల్ ఇండియా జిఆర్పి చిప్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా రైల్వే భద్రత ప్రయాణికుల ఫిర్యాదులపై పరిష్కరించడం పైనే దృష్టి సారించడం జరిగిందని తెలిపారు. ఆర్పీఎఫ్, జి ఆర్ పి లతో నేరాలను తగ్గించే ప్రణాళిక, మెరుగైన రైల్వే భద్రత కోసం కీలకమైన మానవ వనరుల అవసరాలపై చర్చించడం జరిగిందన్నారు. భారతదేశ రైల్వే వ్యవస్థను మంచి గుర్తింపు వచ్చేలాగా రైల్వేలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తప్పక ఐక్యమత్యంతో, సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అదేవిధంగా రైల్వేలో మహిళలకు, పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఆర్పిఎఫ్ చేస్తున్న కృషిని వారు అభినందించారు. ముఖ్యంగా పెరుగుతున్న ప్రయాణికుల పై నేరాలను నివారించేందుకు ఆధునీకరించాల్సిన అవసరాన్ని వారు వివరించడం జరిగిందన్నారు. రైల్వేలో జరుగుతున్న ప్రధాన నేరాలను సమర్థవంతంగా పరిష్కరించాలని తెలిపారు. భారత దేశంలో విస్తృతమైన రైల్వే నెట్వర్క్ యొక్క భద్రత అవసరాలను తీర్చడానికి ప్రతి ఒక్కరూ నిర్మాణాత్మక స్కేలబుల్, ఫ్రేమ్ వర్క్ యొక్క అవసరాలను గుర్తించాలన్నారు. ఈ కాన్ఫరెన్స్ రైల్వే భద్రతను పటిష్టం చేయాలని మా సమిష్టి సంకల్పాన్ని ఈ సమావేశం పునరుద్ ఘాటించడం సంతోషదాయకం అని తెలిపారు. అంతేకాకుండా దేశంలోని రైల్వే వ్యవస్థలో ప్రయాణికులకు సుదక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు. రాష్ట్రంలోని రైల్వే జిఆర్పీల పాత్ర, రైల్వే భద్రత కోసం కొత్త బెంచ్ మార్కులను సెట్ చేయడం కొనసాగించాలని తెలిపారు. అదేవిధంగా అక్కడ పాల్గొన్న అధికారులందరూ కూడా ప్రయాణికుల భద్రతపై ప్రధాన ప్రాధాన్యత ఇస్తామన్న హామీతో సమావేశం ముగిసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశంలోని ఆర్పిఎఫ్, జి ఆర్ పి, డిజిపి లెవెల్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు