Tuesday, February 25, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినిరుపేద కుటుంబానికి చేయూత ఇచ్చిన సంధా రాఘవ

నిరుపేద కుటుంబానికి చేయూత ఇచ్చిన సంధా రాఘవ

తారక్ చేయూత ట్రస్ట్ ద్వారా ఇంటి సరుకులు పంపిణీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని నాగులబావి వీధిలో నివాసముంటున్న మృతి చెందిన సాకే శ్రీరాములు కుటుంబానికి జీవనాధారం కష్టం కావడంతో, నాగుల బావి ప్రజలు తారక్ చేయూత ట్రస్ట్ రామాంజి కు, సభ్యులకు సమాచారాన్ని అందించారు. హుటా హుటిన తారక్ చేయూత ట్రస్ట్ వారు వారి ఇంటికి వెళ్లి సమాచారాన్ని, వారి కష్టాన్ని తెలుసుకొని ఎంతో బాధను వ్యక్తం చేశారు. 15 రోజుల కిందట భర్త షాకే శ్రీరాములు కార్పెంటర్ గా పని చేస్తూ, జీవనాన్ని కొనసాగించేవారు. హఠాత్తుగా భర్త చనిపోవడంతో కుటుంబ భారం భార్య కళ్యాణి బాధ్యత చేపట్టాల్సి వచ్చింది. భర్త చనిపోవడంతో గతంలో భార్య కూడా ఆ కాలనీలో ఇళ్లల్లో పనిచేస్తూ చేదోడు వాదోడుగా ఉండేది. భర్త చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఇంటికి రానివ్వలేదు, పని కూడా ఇవ్వలేదు. దీంతో దిక్కుతోచని ఆ కుటుంబ పరిస్థితిని నాగమణి తారక్ చేయిత ట్రస్టుకు అందించడం జరిగిందని ట్రస్ట్ వారు తెలిపారు. ఈ సమాచారాన్ని పట్టణ ప్రముఖ చేనేత వ్యాపారస్తులు, టిడిపి నాయకుడు, ప్రముఖ దాత అయిన సందా రాఘవకు తారక్ చేయూత ట్రస్ట్ వారు సమాచారాన్ని అందించారు. అప్పటికప్పుడే 7వేల రూపాయలు నగదును అందజేస్తూ, ఆ ఇంటికి నిత్యావసర సరుకులు అందజేయమని ట్రస్టుకు సందా రాఘవ తెలియజేశారు. దీంతో తారక్ చేయుత ట్రస్ట్ వారు ఆ ఇంటికి వెళ్లి సరుకులను అందజేశారు. కళ్యాణికు ముగ్గురు కుమార్తెలు, ఇందులో చివరి అమ్మాయి అయిన దుర్గ శ్రీ పూర్తిగా కళ్ళు కనబడు వు. మొదట కుమార్తె భవ్య శ్రీ ఆరవ తరగతి ప్రభుత్వ స్కూల్లో, రెండవ అమ్మాయి జయశ్రీ మూడవ తరగతి ప్రభుత్వ స్కూల్లో చదువుతోంది.కళ్యాణి మాట్లాడుతూ నా కుటుంబాన్ని ఈ విధంగా ఆదుకున్నందుకు సందా రాఘవాకు, తారక్ చేయుత ట్రస్ట్ వారికి కృతజ్ఞతలను తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు