విశాలాంధ్ర ధర్మవరం;; ఎంతో ఘన చరిత్ర ఉన్న ధర్మవరం మున్సిపల్ టీచర్స్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ( రి.నం.46/1975) కి అధ్యక్షులుగా సానే రవీంద్రరెడ్డి ఎన్నికయ్యారు. స్థానిక కోట మున్సిపల్ స్కూల్ నందు జరిగిన ఎన్నికల లో ఎన్నికల అధికారి గా ఎ.లక్ష్మీనారాయణరెడ్డి వ్యవహరించి, సొసైటీకి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యవర్గం 2030 వరకు కొనసాగుతుందని కమిటీలో అధ్యక్షులుగా ఎస్. రవీంద్రరెడ్డి ఉపాధ్యక్షులుగా ఎ.రమేష్ బాబు,
సెక్రటరీగా ఆర్. రామకృష్ణ నాయక్ డైరెక్టర్లుగా ఎస్.ఆమానుల్లా, ఎం. రాంప్రసాద్, ఎం.అంజి నాయక్ పి. సాయి గణేష్ లకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన రవీంద్రరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ టీచర్ సొసైటీ పురోభివృద్ధికి కృషి చేస్తానని, ఉపాధ్యాయుల ఆర్థిక అవసరాలుకు రూ. 3 లక్షలు సొసైటీ రుణంగా ఇస్తూ ఎప్పుడు తోడ్పాటు అందిస్తుందని తెలియజేశారు. సొసైటీ కి అధ్యక్షులుగా ఎన్నికైన ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి అయిన సానే రవీంద్ర రెడ్డి కి, డైరెక్టర్లుగా ఎన్నికైన ఇతర నాయకులకి సత్యసాయి జిల్లా శాఖ అభినందనలు తెలియజేసింది.
ధర్మవరం మున్సిపల్ టీచర్స్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షులుగా సానే రవీంద్రరెడ్డి ఎంపిక
RELATED ARTICLES