Saturday, January 11, 2025
Homeజిల్లాలుఅనంతపురంఅనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు

అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు

విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ అనంత రాముడు , వైస్ చైర్మన్ రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..తెలుగు వారు ఎంతో వైభవంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటని, ఇది తెలుగుదనానికి ప్రతీక అయిన పర్వం అని పేర్కొన్నారు. అనంతరం వైస్ ఛైర్మన్ గారు మాట్లాడుతూ, సంక్రాంతి శుభవేళ తెలుగు సంస్కృతి వివిధ రూపాలలో ప్రత్యక్షమవుతుందని, సజీవ చైతన్యంతో, మనోహరంగా తొనికిసలాడుతుందని తెలియజేశారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో చిన్నారుల వేషధారణలు, డూడూ బసవన్నల చేత సన్నాయి మేళం, గంగిరెద్దుల ద్వారా సీతారాముల కళ్యాణం, తెలుగుదనం ఉట్టిపడేలా కోలాట నృత్యం, గురువయ్యల నృత్యం, గొబ్బెమ్మ పాటలకు పిల్లలు లయబద్దంగా నృత్యం చేశారు. పిల్లలు గాలిపటాలను ఎగరవేయటం వంటి కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. అనంతరం చైర్మన్ గారి దంపతులు పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సీఏఓ నరసింహారావు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు