Friday, January 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికాకతీయ విద్యా నికేతన్ లో కోలాహలంగా సంక్రాంతి సంబరాలు..

కాకతీయ విద్యా నికేతన్ లో కోలాహలంగా సంక్రాంతి సంబరాలు..

కరెస్పాండెంట్ నిర్మలాదేవి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ లో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నడుమ, కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించడం జరిగిందని కరెస్పాండెంట్ నిర్మలాదేవి తెలిపారు. రంగురంగుల ముగ్గులతో, రకరకాల పూలతో, గొబ్బెమ్మలు, భోగి మంటలు, పాల పొంగులతో అందంగా అలంకరించారు. విద్యార్థినీ, విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో అందంగా మెరిసిపోయారు.చిన్న పిల్లలకు భోగి పళ్ళు ను వేశారు. విద్యార్థులకు రంగువల్లుల పోటీ నిర్వహించగా, విజేతలకు బహుమతి ప్రధానమును పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగ విశిష్టతను కరెస్పాండెంట్ తో పాటు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు చక్కగా వివరించడం జరిగింది. రంగ వల్లలు మధ్య విద్యార్థుల నృత్యాలు, హరిదాసు నృత్యం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సూర్యప్రకాశ్ రెడ్డి, పద్మ, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు