Friday, January 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతిఒక్కరి సిరిసంపదల పండుగ సంక్రాంతి..

ప్రతిఒక్కరి సిరిసంపదల పండుగ సంక్రాంతి..

కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; సంక్రాంతి పండుగ సందర్భంగా రేగాటిపల్లి రోడ్డు నందు స్థానిక శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సంబరాలలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు భోగి మంటలు వేసి, భోగి మంటల చుట్టూ తిరుగుతూ, గ్రామీణ సంప్రదాయ నృత్యాలు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ మాట్లాడుతూ గ్రామీణ సిరిసంపదల పండుగ సంక్రాంతి అని,సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కరూ ఆ రోజున సొంత ఊర్లకు వచ్చి సంబరాలను నిర్వహించుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి రమేష్, అధ్యాపకులు శ్రీనివాసులు, హరీష్ కుమార్, బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు