Wednesday, May 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికదిరి రైల్వే ఓవర్ బ్రిడ్జి బాధితులకు సంతృప్తికరమైన ఎక్స్ గ్రేషియా చెల్లింపు

కదిరి రైల్వే ఓవర్ బ్రిడ్జి బాధితులకు సంతృప్తికరమైన ఎక్స్ గ్రేషియా చెల్లింపు

గత వైసిపి ప్రభుత్వం లో ఆర్ఓబి బాధితులకు అన్యాయం

గత వైసిపి ప్రభుత్వ దౌర్జన్యకాండలో బాధితులకు అండగా నిలబడ్డ పరిటాల శ్రీరామ్

రైల్వే ఓవర్ బ్రిడ్జ్ బాధితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కదిరి రైల్వే ఓవర్ బ్రిడ్జి బాధితులకు ఎక్స్ గ్రేషియా చెల్లింపులో గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్య నిరంకుశ వైఖరికి నిరసనగా గతంలో బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం విధితమే. ఆనాడు ఆర్ఓబి బాధితులకు ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ అండగా నిలబడి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్స్ గ్రేషియా పెంచి బాధితులకు న్యాయం చేస్తామని నాడు భరోసా ఇచ్చిన పరిటాల శ్రీరామ్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బాధితుల స్థలాలకు కానీ ఇళ్లకు కానీ సరైన కొలతలు చూపకుండా ఇష్టానుసారం కొలతలు వేసి బాధితులను భయభ్రాంతులకు గురిచేసి ఇళ్లను ఖాళీ చేయాలని గతపాలకులు హుకుం జారీ చేస్తే,నేడు పరిటాల శ్రీరామ్ సంబంధిత మంత్రులతో, ప్రభుత్వంతో మాట్లాడి గతంలో కన్నా ఒక్కొక్క సెంటుకు ఆదనంగా నాలుగున్నర లక్షల రూపాయలు పైబడి బాధితులకు ఎక్స్ గ్రేషియా చెల్లించడం జరుగుతోందని, బాధితుల పక్షాన నిలబడి సహకరించిన ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారి మహేష్ కుపరిటాల శ్రీరామ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా త్వరితగతిన బాధితులకు ఎక్స్ గ్రేషియా అందే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని పరిటాల శ్రీరామ్ ఆర్డీవోను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు