విశాలాంధ్ర ధర్మవరం: హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీ నుండి
19వ తేదీ వరకు మదనపల్లిలో జరగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీలలో పాల్గొనే సత్యసాయి జిల్లా హాకీ జట్టును హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్,సత్యసాయి జిల్లా సెక్రెటరీ బంధనాథం సూర్య ప్రకాష్,హాకీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు బి.వి శ్రీనివాసులు పత్రికా ముఖంగా ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియ ఇటీవల స్థానిక క్రీడా మైదానంలో జరిగిన విషయం విదితమే అన్నారు.
జట్టు సభ్యులుగా : శబరీష్ గౌడ్ ,ఫజులుద్దీన్, వెంకట్ అభిషిక్త్,రితీష్, రాంచరణ్,సాదిక్ వలి,గోవర్ధన్, జశ్వంత్,నవదీప్,ఆదికేశవ,
విక్కీ,పోతలయ్య, స్వామి,సచిన్, కార్తీక్,ధనూష్, రాహుల్, పుణీత్ చరణ్ తేజ్,ఉన్నారు అని తెలిపారు. ఈ జట్టుకు శబరీష్ గౌడ్ కెప్టెన్ గా వ్యవహారిస్తారన్నారు.కోచ్ గా సాయికుమార్, మేనేజర్ గా వెంకటేష్ నాయక్ వ్యవహరించనున్నారని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి, జిల్లా జట్టును విజేతగా నిలపాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హాకీ సత్యసాయి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గౌరీ ప్రసాద్,హాకీ సత్యసాయి జిల్లా జాయింట్ సెక్రెటరీ అరవింద్ గౌడ్, జెన్నే చంద్రశేఖర్, సత్యసాయి జిల్లా హాకీ కోచ్ హస్సేన్ పాల్గొన్నారు.
ఎంపికైన జిల్లా జట్టుకు హాకీ సత్యసాయి జిల్లా గౌరవ అధ్యక్షులు బండి వేణుగోపాల్,పల్లెం వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ ఉడుముల రామచంద్ర, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర,ట్రెజరర్ అంజన్న, డైరెక్టర్లు మారుతి, అమునుద్దీన్, కిరణ్,ఇర్షాద్, శుభాకాంక్షలు తెలియజేశారు.
సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ బాలుర హాకీ జట్టు ఎంపిక.. సూర్య ప్రకాష్
RELATED ARTICLES