రైతు సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమ బాట చేపడతాం
ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంబులయ్య
విశాలాంధ్ర- అనంతపురం : దేశవ్యాప్తంగా రైతుల సమస్యలపై ఢిల్లీలో పోరాడుతున్న పంజాబ్, హర్యానా రైతులు పెట్టిన డిమాండ్ ను చట్టబద్ధం చేయాలని లేనియెడల కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంబులయ్య హెచ్చరించారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమానికి మద్దతుగా బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏపీ రైతు సంఘం, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంబులయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటమయ్య, జిల్లా అధ్యక్షులు చిన్నప్ప యాదవ్, ఏపీ రైతు సంఘం కార్యదర్శులు సి.మల్లికార్జున, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా రైతుల రుణమాఫీ చేసే ఆదుకోవాలని, కేరళ తరహా పద్ధతిలో పునర్ సవరణ చట్టం తీసుకొని ఆదుకోవాలన్నారు. రైతుల ఎన్నో సంవత్సరాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు తో పాటు జాయింట్ పార్లమెంట్ చెప్పడం జరిగిందన్నారు. దీనిని అమలు చేసే విధంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి జిల్లిలో జరుగుతున్నటువంటి రైతు ఉద్యమాన్ని పూర్తిగా సంఘీభావం తెలుపుతున్నామన్నారు. రైతులకు మోడీ క్షమాపణ చెప్పి లిఖిత పూర్వకంగా రైతు సంఘం నాయకులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలన్నారు. ఢిల్లీ కేంద్రంగా పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నాయకులు ఆందోళన చేపడుతున్నారన్నారు. స్వామినాథన్ ఇచ్చిన సిఫార్సు రైతులకు జి ప్లస్ టు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రైతుల అప్పులు మాఫీ చేస్తామని, విద్యుత్ సంస్థలను ఆపేస్తామని చెప్పి జాతికి క్షమాపణ చెప్పడం జరిగిందన్నారు. దొడ్డి దారిన కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం పట్ల తిరిగి రైతు సంఘం నాయకులు భగత్ సింగ్ దల్ వాలా, ఆమరణ దీక్షలు చేపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆపడానికి ప్రయత్నం చేయలేదన్నారు ఈ విషయంపై సుప్రీంకోర్టు చెప్పినా కూడా నరేంద్ర మోడీకి లెక్క లేదన్నారు. రైతులకు గుర్తుకొస్తారు అని ఎన్నికల అయిన తర్వాత కార్పొరేటర్లు కు వ్యవసాయ రంగమంతా కూడా కార్పొరేట్ల కు అప్పజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రైతుల సమస్యల పట్ల పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. లేని పక్షాన రాబోవు కాలంలో కన్యాకుమారి టూ కాశ్మీర్ వరకు దేశవ్యాప్తంగా రైతుల సమస్యలు పరిష్కరించే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డి. చెన్నప్ప యాదవ్, కాలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శిలు నీ లపాల రామకృష్ణ, వీ.టి రామాంజనేయులు, రైతు సంఘం నాయకులు పి వన్నారెడ్డి, వి. వెంకట్రాముడు, రైతు మహిళా నాయకురాలు లలితమ్మ, సింగనమల నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి, రాము, గోపాల్,రామాంజనేయులు, ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి కుళాయి స్వామి, ఏఐటీయూసీ నగర కార్యదర్శి కృష్ణుడు, నగర అధ్యక్షులు జి చిరంజీవి, వెంకటేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.