Sunday, January 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

విశాలాంధ్ర, కదిరి : కదిరి బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శేషం మహేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శేషం మహేంద్ర మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే జననం (1831 జనవరి 3 – మరణం 1897 మార్చి 10) భారతీయ సంఘ సంస్కర్త,
ఉపాధ్యాయిని, రచయిత్రి అన్నారు.ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి తెలిపారు.ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించి,కుల వ్యవస్థకు,పితృస్వామ్యానికి వ్యతిరేకంగా,శూద్రుల, అస్పృశ్యుల,మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారన్నారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిన గొప్ప శక్తి అని కొనియాడారు.పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని సావిత్రిబాయి ఆశయాలతో విద్యార్థినిలు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ టౌన్ సెక్రటరీ నవీన్,సాయి, కృష్ణ,హరి,నవ్య, కవితా, దీప్తి, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు