పుట్టపర్తి జిల్లా ఎస్బిఐ రీజినల్ మేనేజర్. శశిధర్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని నాలుగు ఎస్బిఐ బ్రాంచ్ లు పదవీ విరమణ పొందిన వివిధ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా విశేష సేవలు అందిస్తున్నామని పుట్టపర్తి జిల్లా ఎస్బిఐ రీజినల్ మేనేజర్ శశిధర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించబడుతున్న సమావేశానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం విశ్రాంతి ఉద్యోగుల నూతన సంవత్సరపు 2025 డైరీ ని వారు విడుదల చేశారు. అనంతరం రీజినల్ మేనేజర్ శశిధర్ కుమార్ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులు అందరూ కూడా తమ పెన్షన్ పదిలంగా ఉంచుకోవడానికి, వివిధ సేవలను అందిస్తోందని తెలిపారు. అంతేకాకుండా పెన్షన్దారులందరికీ కూడా బ్యాంకు నియమ నిబంధనల ప్రకారం రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. తదుపరి బ్యాంకు లాకర్లు, వివిధ డిపాజిట్లు, వివిధ బ్యాంకు సమస్యల పరిష్కారానికి మా బ్రాంచ్ మేనేజర్ల అందరూ కూడా తమ సహాయ సహకారాలను అందిస్తున్నామని తెలిపారు. పెన్షన్ దారులుఅందరికీ కూడా ఎస్బిఐ బ్యాంకు సేవలపై అవగాహన కల్పించేందుకే తాను రావడం జరిగిందని తెలిపారు. త్వరలో ఈనెల మాసాంతం లోపు ధర్మవరం పట్టణము, రూరల్ పరిధిలో పదవీ విరమణ పొందిన వివిధ విభాగాల ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బిఐ చేస్తున్న సేవలను పూర్తి అవగాహన సదస్సుతో సరియైన సమాచారాన్ని కరపత్రం ద్వారా తప్పక అందించి, మీ సేవలను తాము ఎస్బిఐ ద్వారా సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. ఏవేని బ్యాంకు సమస్యలు ఉన్న యెడల నేరుగా మా బ్రాంచ్ మేనేజర్లతో సంప్రదించవచ్చునని, ఎక్కడైనా మీకు బ్యాంకు సమస్యల్లో తేడా వస్తే తనకు ఫిర్యాదు చేయవచ్చునని వారు స్పష్టం చేశారు. తదుపరి విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చలపతి, కార్యదర్శి నర్సిరెడ్డి ఎస్బిఐ చేస్తున్న సేవలను వారు కొనియాడారు. తప్పక ఎస్బిఐ సేవలను పొందేలా తమ సంఘము ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు రామయ్య కోశాధికారి సుధాకర్, టౌన్ బ్రాంచ్ మేనేజర్ ఉమామహేశ్వర వర్ధన్, బ్యాంకు సిబ్బంది, పెన్షన్ దారులు పాల్గొన్నారు.
పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఎస్బిఐ బ్యాంక్ విశేష సేవలను అందిస్తోంది..
RELATED ARTICLES