Monday, March 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమానవాళి అన్ని సమస్యలకు పరిష్కారం చూపేది సైన్సే … జనవిజ్ఞాన వేదిక

మానవాళి అన్ని సమస్యలకు పరిష్కారం చూపేది సైన్సే … జనవిజ్ఞాన వేదిక

విశాలాంధ్ర ధర్మవరం; మానవాళి అన్ని సమస్యలకు పరిష్కారం చూపేది సైన్సే అని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ విక్రాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సూర్య స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు నరేంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. పరిణామక్రమంలో మానవ జీవితానికి, సైన్సుకు విడదీయ రాని బంధం వుందనీ,మానవ వికాసం సైన్సుతోనే సాధ్యమయిందన్నారు. ఇదంతా పరిశీలన, స్వీయ రక్షణ, అనుభవాల సమ్మిళితంగా కొనసాగిందన్నారు. ఆదిమ మానవుని జీవితం ఆహారానికై వేట, దాహం తీర్చుకోడానికి నీటి వనరుల అన్వేషణ ఆపై సేద తీరడానికి ఓ చోటు చూసు కోవడంతో ఆరంభమైందన్నారు. ఆ క్రమంలో పరిసరాల పరిశీలన ,అననుకూల వాతావరణ పరిస్థితుల పై అవగాహన ఏర్పడి ప్రకృతి సిద్ధమైన పగలు ,రాత్రి అనుభవంతో పగలు ఆహారానికి శ్రమించి, రాత్రి విశ్రమించే విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడన్నారు. ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, పిడుగులు, బడబాగ్నిలను చూసి మొదట్లో భయపడ్డాడనీ ,ఆ తరువాత వాటినుండి రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాడన్నారు.
అందుకే ప్రతీ పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్నీ కలిగి ఉండాలని, పౌరుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ప్రభుత్వం బాధ్యత అనీ మన రాజ్యాంగంలోని 51 అధికరణంలో పొందుపరచుకున్నామన్నారు.జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు మాట్లాడుతూ
ప్రతి ఏటా శాస్త్ర ,సాంకేతికతల ప్రచారానికి, శాస్త్రీయ దృక్పథం ప్రచారానికి ఫిబ్రవరి 28 న జాతీయ సైన్సు డే ను దేశవ్యాప్తంగా జరుపు కుంటున్నామన్నారు.
నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ [(ఎన్.సి.ఎస్.టి.సి.) ప్రస్తుత ఎన్.ఓ.ఎస్. టి.సి] 1986లో, ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా (నిర్దిష్టంగా నిర్ణయించి) గుర్తించాలని భారత ప్రభుత్వా న్ని కోరగా, 28 ఫిబ్రవరి 1928న భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ ” రామన్ ప్రభావం ” అనే దృగ్విషయం కనుగొన్నందుకు గుర్తుగా భారత ప్రభుత్వం జాతీయ సైన్సు డే ను ప్రకటించిందన్నారు. తదుపరి డాక్టర్ ఆదిశేషు చేసిన మ్యాజిక్ విద్యార్థులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో సూర్య స్కూల్ ప్రధానోపాధ్యాయుడు నరేంద్ర బాబు, జెవివి లోకేష్,ఉపాద్యాయులు ప్రభావతి,జాహ్నవి, శీనా, శ్యామల, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు