విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలో ఎస్సీ ( మాదిగ) కులానికి సంబంధించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం పట్ల బుధవారం ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ అనుబంధ ఎస్సీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఉరవకొండ నియోజకవర్గం లో దళితుల అభివృద్ధికి రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ చేస్తున్న కృషిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ ఎస్సీ విభాగం సీనియర్ నాయకులు సరస్వతమ్మ, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కౌకుంట్ల రవి, ఎస్సీ సెల్ నాయకులు ఎం. వరప్రసాద్, పెద్ద ముష్టూరు రామకృష్ణ, లత్తవరం చంద్ర, వార్డ్ సభ్యుల రామాంజనేయులు, మధు, ఎమ్మార్పీఎస్ నాయకులు గంగాధర్, నారాయణస్వామి, మీనుగా పెద్దన్న దండోరా రమేష్, ఈరన్న, బి.గోపాల్ సుంకన్న, రామకృష్ణ, రవివర్మ, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు పట్ల ఎస్సీలు హర్షం
RELATED ARTICLES