Monday, April 21, 2025
Homeజిల్లాలునెల్లూరుసమయపాలన పాటించని సచివాలయం సిబ్బంది

సమయపాలన పాటించని సచివాలయం సిబ్బంది

ఎమ్మెల్యే తనిఖీ చేసినా తీరుమారని సచివాలయం సిబ్బంది

ప్రజలకు అందని సేవలు..

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని పోకూరు సచివాలయం లో ఎంఎల్ హెచ్ పీ తప్ప మిగతా సచివాలయంసిబ్బంది సమయపాలనపాటించక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నిబంధనల ప్రకారం సచివాలయం సిబ్బంది ఉదయం 10 గంటలకు విధులకు హాజరు అవ్వాల్చి ఉంది.సాయంత్రం 5 గంటలవరకు అక్కడే ఉండి విధులు నిర్వర్తించాల్చి ఉంటుంది.కాని పోకూరు సచివాలయం సిబ్బంది మాత్రం తమకు ప్రభుత్వం నిబంధనలు ఏ మాత్రం పట్టనట్లు వ్యవహారిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉదయం 10 గంటలకు రావాల్చిన సచివాలయం సిబ్బంది 11 గంటలైనా సచివాలయం నకు రావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.

ఎమ్మెల్యే తనిఖీ చేసినా తీరుమారని సచివాలయం సిబ్బంది.

ఇటీవల పోకూరు సచివాలయం ను స్థానికశాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, అధికారులతో కలిసి పోకూరు సచివాలయం ను తనిఖీ చేసి విధులకు రాని సిబ్బంది ని గుర్తించి సచివాలయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడానికి వివరణ ఇవ్వాలని ఎంపిడిఓ షాకాజ్ నోటీసు జారీ చేశారు అయినా సిబ్బంది తీరు మారలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా సచివాలయం సిబ్బంది సమయానికి సచివాలయం వచ్చి ప్రజలకు సేవచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

విచారించి చర్యలు తీసుకుంటా.ఎంపిడిఓ

పోకూరు సచివాలయం సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు సచివాలయం దగ్గర ఇబ్బందులు పడుతున్నారని ఎంపిడిఓ నరేంద్ర దేవ్ ను విశాలాంధ్ర విలేకరి వివరణ కోరగా స్పందించిన ఎంపిడిఓ విచారించి చర్యలు తీసుకుంటానని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు