Thursday, January 30, 2025
Homeజిల్లాలువిజయనగరంపలు కంపెనీలకు 63 మంది ఉద్యోగాలకు ఎంపిక

పలు కంపెనీలకు 63 మంది ఉద్యోగాలకు ఎంపిక

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ (ఏ పి ఎస్ ఎస్ డి సి), జిల్లా ఉపాది కార్యాలయం సీ డా ఏ సంయుక్త ఆధ్వర్యం లో గవర్నమెంట్ ఐ.టి.ఐ కాలేజీ, రాజాం నందు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ భాస్కర రావు మాట్లాడుతూ, చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటమే ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవాలని తెలిపారు. ఈ జాబ్ మేళా కి 178 మంది అభ్యర్ధులు అటెండ్ అయ్యారు వీరిలో పలు కంపెనీలకు 63 మంది ఉద్యోగాల కు ఎంపికయ్యారు మరొక 12 మంది తదుపరి రౌండ్ కు ఎంపిక కావడం జరిగింది. ఈ జాబ్ మేళా లో శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ 15, హెటిరో డ్రగ్స్ 27, హెచ్డిఎఫ్సి 6, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ 8, ఎల్.జి ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ 7, చొప్పున ఈ సంస్థలు సెలెక్ట్ చేయడం జరిగినది.ఇంటర్వ్యూ లో ఎంపిక కాబడిన అభ్యర్ధులకు నెలకు జీతం 10,000/- నుండి 25,000 వరకు ఇవ్వటం: జరుగుతుందని తెలిపారు. ఈ యొక్క జాబ్ మేళాలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న రాజాం ఐటిఐ కాలేజ్ ప్రిన్సిపల్ బి.భాస్కరరావు, స్కిల్ డెవలప్మెంట్ ప్లాస్మంట్ అధికారి టి. భాస్కర్, ఎంప్లాయిమెంట్ యుంగ్ ప్రొఫెషనల్ యశ్వంత్ సీ డాప్ సిబ్బంది, కళాశాల, స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు