విశాలాంధ్ర -ధర్మవరం : రాష్ట్రస్థాయి కబాడీ పోటీలకు ధర్మవరం క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందని కబాడీ కోచ్ పృథ్వి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంతకల్ రైల్వే క్రీడా మైదానంలో జరిగిన ఉమ్మడి అనంతపురం జిల్లా కబాడీ పోటీలలో ధర్మవరంకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి కబాడీ పోటీలకు ఎంపిక కావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి కబాడీకి ఎంపికైన క్రీడాకారులలో ఆసిఫ్, రాజు, సాజియాలు కలరని తెలిపారు. వీరు ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు పులివెందులలో జరిగే రాష్ట్రస్థాయి కబాడీ పోటీలకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ప్రతిభ ఘనపరిచిన క్రీడాకారులు ధర్మవరంలోని వివేకానంద స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్డిటి క్రీడా మైదానంలో కబడ్డీ శిక్షణ పొందుతున్నారని వారు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఈ క్రీడాకారులను సీనియర్ క్రీడాకారులతోపాటు కోచ్ పృథ్వి కూడా అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
కబాడీ రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులు ఎంపిక… కబాడీ కోచ్ పృథ్వి
RELATED ARTICLES