ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; చేనేతకు రాష్ట్ర బడ్జెట్లో తీవ్రమైన అన్యాయం జరిగిందని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
చేనేత పరిశ్రమపై లక్షలాదిమంది ఆధారపడి జీవిస్తున్నారు అని, దాదాపుగా లక్ష మగ్గాలు పైగా కలిగి ఉండి ఐదు లక్షల పైగా కుటుంబాలు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు అని తెలిపారు. వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ మందికి ఉపాధి చూపించే పరిశ్రమగా ఉన్నది అని, బడా పెట్టుబడిదారులకు పరిశ్రమ పెట్టుకుని 1000 నుండి 10,000/ వరకు ఉపాధి కల్పిస్తారనే పేరుతో వారికి వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. లక్షల మందికి ఉపాధి చూపిస్తున్న చేనేత పరిశ్రమకు కేవలం బడ్జెట్లో 115.70 కోట్లు కేటాయించడం దారుణం అని మండిపడ్డారు. ఇది చేనేత కార్మికులపై చిన్న చూపు చూస్తున్నారు అని మండిపడ్డారు. అది కాక ఇందులో త్రిఫ్ట్ ఫండ్ కి 5 కోట్లు మాత్రమే చేనేత సహకార సంఘ సభ్యులకు మాత్రమే ఉపయోగపడుతుంది అని, ఎన్ సి డి సి కి 5 కోట్లు యూనిటీ మాల్ 66 కోట్లు కేటాయించడం, చేనేత కార్మికుల దగ్గరకు వెళ్లదు అని తెలిపారు. ఇందులో కేవలం ఐదు కోట్లు మాత్రమే చేనేత కార్మికులకు లబ్ది కలుగుతుంది అని తెలిపారు. మిగిలిన 110 కోట్లు అలంకారప్రాయంగా ఉంది అని, నేతన్న నేస్తం 24.000 ఊసే లేకపోవడం దారుణమని తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాలుగా సహకార సంఘాలకు ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలు యారన్ సబ్సిడీ, పావలా వడ్డీ, రిబేటు, త్రిఫ్ట్ ఫండ్, మార్కెట్ ఇన్సెంటు బకాయి చెల్లించే ఊసే బడ్జెట్లో కనిపించలేకపోవడం బాధాకరమన్నారు. భారతదేశ స్వాతంత్రం పొందిన తర్వాత చేనేతలకు ఇంత దారుణమైన బడ్జెట్ కనీ విని ఎరుగము అని బాధలు వ్యక్తం చేశారు. వాగ్దానాలు చేయడంలో ఆరితేరిన చంద్రబాబు నాయుడు నేతన్న నేస్తం కంటే మెరుగైన పథకాలను అందిస్తామని చెప్పి బడ్జెట్లో ఆ ఊసే లేకపోవడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. చేనేత వస్త్రాలపై జిఎస్టి, రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నామని నమ్మబలికి బడ్జెట్లో ఆ ఊసే లేదు అని తెలిపారు. ఇంత దారుణమైన మోసం చేనేత కార్మికులు ఎన్నడూ ఊహించలేదు అని తెలిపారు. నేతన్నల ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే బడ్జెట్ను సవరించి, తమ తప్పును సరిదిద్దుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం మార్పు రాకపోతే పోరాటాలకు సిద్ధం అని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. . బడ్జెట్ పై చర్చించేందుకు కర్నూలు జిల్లా లో చేనేత కార్మిక సంఘం విస్తృత స్థాయి సమావేశం మార్చి 9వ తేదీకు కార్యక్రమం రూపొందించుకునేందుకు సమావేశం అవుతున్నట్లు వారు తెలియజేశారు.
చేనేతకు రాష్ట్ర బడ్జెట్లో తీవ్రమైన అన్యాయం…..
RELATED ARTICLES