Tuesday, April 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేదలకు, రోగులకు చేసే సేవ దైవ సేవతో సమానం..

పేదలకు, రోగులకు చేసే సేవ దైవ సేవతో సమానం..

శ్రీ సత్య సాయి సేవ సమితి-2
విశాలాంధ్ర ధర్మవరం : పేదలకు, రోగులకు చేసే సేవ దైవ సేవతో సమానమని శ్రీ సత్యసాయి సేవాసమితి-2 సుబ్బదాసు భజన మందిరం-టిఆర్టి సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం అల్పాహారమును (పాలు, బ్రెడ్,బిస్కెట్లు) దాదాపు 150 మందికి నర్సులు, వైద్యులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతో ఇటువంటి సేవా కార్యక్రమం ను గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించడం మాకెంతో తృప్తిని,సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. నేటి ఈ సేవా కార్యక్రమానికి దాతగా శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలం తాసిల్దార్ కార్యాలయంలోని వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవా సమితి వారు చేస్తున్న ఈ సేవలు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తాయని, దాతలు కూడా ఇటువంటి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించడం రోగులకు ఒక వరం లాగా మారిందని తెలుపుతూ సేవా సమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు