కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర-ధర్మవరం : రోగులకు సేవ చేయడం దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు 380 మంది కు భోజనపు ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లను ఆసుపత్రి వైద్యులు ,సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేశారు. అనంతరం కన్వీనర్ నామ ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలకి సేవాదాతలుగా ఉపేంద్ర,కృష్ణవేణి వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుట మాకెంతో సంతోషాన్ని ,తృప్తిని ఇచ్చిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి సేవా కార్యక్రమాల్ని పుట్టపర్తి బాబా ఆశీస్సులతో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవా సమితి చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని ప్రతి వ్యక్తి తనకున్న దానిలో దాన సేవా కార్యక్రమాలను నిర్వహించినప్పుడే మానవతా విలువలు పెరుగుతాయని తెలిపారు.ఇటువంటి కార్యక్రమాలకు ఆసక్తి కలవారు సెల్ నెంబర్ 9966047044 గాని 9030444 065కు గాని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
రోగులకు సేవ చేయడం దైవ సేవతో సమానం
RELATED ARTICLES