విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలో గల ఎస్వీఎస్ ఇంగ్లీష్ మీడియం లో ఏడవ తరగతి చదువుతున్న కే రఘురాం విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన అబాకస్ వేదిక్ మాథ్స్ నేషనల్ లో లెవెల్-3 విభాగంలో నేషనల్ ఫస్ట్ ప్రైజ్ తో పాటు 5000 రూపాయల నగదును, షీల్డ్ను కైవసం చేసుకోవడం జరిగిందని కరెస్పాండెంట్ పి. కాంతమ్మ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మా పాఠశాలలో చదువుతోపాటు అబాకస్, క్రీడల్లో కూడా విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే పలు క్రీడల్లో విజేతలుగా ఉన్నామని తెలిపారు. గత ఏడాది కూడా ఐదవ తరగతి చదువుతున్న వెంకటేష్ అను విద్యార్థి లెవెల్-4 లో నేషనల్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ సాధించడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆ విద్యార్థులను డైరెక్టర్లు మోహన్, గణితపు ఉపాధ్యాయులు శంకర్ నాయక్, శివ లతోపాటు తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
అబాకస్ లో ప్రతిభ చాటిన ఏడవ తరగతి విద్యార్థి కే.రఘురాం
RELATED ARTICLES