Monday, February 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిజయవంతంగా ముగిసిన ఏడవ స్టేట్ లెవెల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు..

విజయవంతంగా ముగిసిన ఏడవ స్టేట్ లెవెల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు..

యువర్స్ ఫౌండేషన్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కొత్తపేట, రామ్ నగర్ లో గల శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏడవ స్టేట్ లెవెల్ ఓపెన్ చెస్ టోర్నమెంటులు ప్రారంభం కావడం జరిగిందని యువర్స్ అధ్యక్షులు షీలా నాగేంద్ర కార్యదర్శి జయరాం కోశాధికారి వెంకటాద్రి మోహన్, పీఆర్వో రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చెస్ పోటీలు రెండు రోజులు పాటు (ఈనెల 7 అండ్ 8 వ తేదీలు) నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వివిధ జిల్లాల నుండి ఈ పోటీలకు రావడం జరిగిందని మొత్తం 270 మంది చెస్ క్రీడాకారులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. మొత్తం 60 వేల రూపాయల ప్రైజ్ నగదు బహుమతులు ఉంటాయని తెలిపారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు ట్రోపులు, మెడల్స్, షీల్డ్ పంపిణీ చేయడం జరిగిందన్నారు వచ్చిన క్రీడాకారులందరికి కూడా రెండు రోజులపాటు వసతి, భోజనం కూడా కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైల్వే ఆర్పిఎఫ్ సిఐ బోయ కుమార్, ఏపీ స్టేట్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి సుమన్, టోర్నమెంట్ హానేబుల్ ప్రెసిడెంట్ డాక్టర్ బి వి సుబ్బారావు, యువర్స్ ఫౌండేషన్ చేతుల మీదుగా బహుమతులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం చెస్ పోటీల వల్ల కలుగు ఉపయోగాలను కూడా క్రీడాకారులకు వివరించడం జరిగిందని వారు తెలిపారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు, హైయ్ బ్రో చెస్ అకాడమీ అనంతపురం ఆర్గనైజింగ్ కార్యదర్శి జాకీర్ హుస్సేన్ నేతృత్వంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధమ బహుమతి ధర్మవరానికి చెందిన కె దుర్గాప్రసాద్, ద్వితీయ బహుమతి టి అఫ్రిద్ ఖాన్ , తృతీయ బహుమతి కె భరత్ భూషణ్ విజయదులుగా ప్రకటించి, ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు.చెస్ పోటీలు ఆడటంలో క్రీడాకారులు హోరాహోరీగా తమ సత్తాను చాటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుంకు సుకుమార్, కోశాధికారి వంకదారి మోహన్, గర్రె రమేష్ బాబు, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ చాంద్ బాషా, వ్యవస్థాపక అధ్యక్షులు పోలా ప్రభాకర్, వై కే. శ్రీనివాసులు, కోటేశ్వరరావు, సుంకు బండ్లపల్లి రంగనాథ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు