విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : జిల్లాలో జరిగిన భగవద్గీత శ్లోకాలను పఠించే జిల్లాస్థాయి పోటీల్లో పెద్దకడబూరులోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల విధ్యార్థిని లావణ్య ప్రతిభ కనబరిచి మూడో స్థానంలో నిలిచింది. రేయిన్ బో పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న లావణ్య భగవద్గీతలోని 47శ్లోకాలను ఏకధాటిగా చెప్పి తృతీయ బహుమతి గెలుపొందారు. దీంతో మంగళవారం విద్యార్థిని లావణ్యను పాఠశాల కరస్పాండెంట్ గోవిందరెడ్డి, ఉపాధ్యాయులు ప్రసాద్, పుల్లయ్య, రామకృష్ణ, పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ గోవిందరెడ్డి మాట్లాడుతూ భగవద్గీత శ్లోకాలను పఠించే జిల్లాస్థాయి పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని లావణ్య మూడో స్థానంలో నిలవడం తమ గర్వంగా ఉందని వెల్లడించారు.