Friday, January 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేట్ సెక్రటరీగా శెట్టిపి జయచంద్రా రెడ్డి

ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేట్ సెక్రటరీగా శెట్టిపి జయచంద్రా రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం : ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ (అనంతపురం, సత్య సాయి జిల్లాలు కలిసి ఉన్న అసోసియేషన్) ధర్మవరం ప్రాంతమునకు సముచిత స్థానం లభించింది. ఆదివారం సాయంత్రం అనంతపురం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి ధర్మవరం పట్టణానికి చెందిన శెట్టిపి జయచంద్రా రెడ్డిని ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ధర్మవరం పట్టణం నుండి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ బాస్కెట్బాల్ రాష్ట్ర జట్టుకు వరుసగా మూడుసార్లు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ధర్మవరం పట్టణంలో బాస్కెట్బాల్ క్రీడాభివృద్ధికి 22 సంవత్సరాల నుండి ధర్మాంబ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులతో, సభ్యులు తో కలిసి బాల, బాలికలను జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో తీర్చిదిద్దడంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, నిరంతరం కృషిచేస్తున్న శెట్టిపి జయచంద్రా రెడ్డి ని ఆదివారం రోజున ఉమ్మడి జిల్లా అసోసియేట్ సెక్రటరీగా ఎంపిక కావడం పట్ల ధర్మాంబ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయతుల్లా, అసోసియేషన్ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు, యుటిఎఫ్ నాయకులు, ఆత్మీయ ట్రస్ట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తన నియామకం పట్ల జయచంద్రా రెడ్డి ఉమ్మడి జిల్లా అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. బాస్కెట్బాలును జాతీయ రాష్ట్రస్థాయిలో మరింత అభివృద్ధి పరిచేందుకు నా వంతుగా కృషి చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు