Wednesday, January 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయియుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా శెట్టిపి జయచంద్రా రెడ్డి ఎంపిక

యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా శెట్టిపి జయచంద్రా రెడ్డి ఎంపిక

విశాలాంధ్ర -ధర్మవరం ; ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర కార్యదర్శిగా ధర్మవరం పట్టణానికి చెందిన ప్రస్తుత శ్రీ సత్యసాయి జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులు శెట్టిపి జయచంద్ర రెడ్డి ఎంపికయ్యారు. బుధవారం రోజున కాకినాడ నగరంలోని పి. ఆర్. గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు జరిగిన 17వ రాష్ట్ర స్వర్ణోత్సవ మహాసభల నందు యుటిఎఫ్ రాష్ట్ర నాయకత్వం ఏకగ్రీవంగా ఆయన్ను రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది.
శెట్టిపి జయచంద్రా రెడ్డి యుటిఎఫ్ కార్యకర్త స్థాయి నుండి ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యదర్శిగా, కోశాధికారిగా, గౌరవ అధ్యక్షులుగా, అధ్యక్షులుగా, ఉమ్మడి అనంతపురం జిల్లా ఎఫ్ ఏ పి టి ఓ చైర్మన్ గా పనిచేసి, ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయన ఉమ్మడి జిల్లాలో ఉత్తర ప్రాంతం (అనంతపురం జిల్లా) నుండి కాకుండా దక్షిణ ప్రాంతం (సత్యసాయి జిల్లా) నుండి 50 సంవత్సరాల తర్వాత మొట్ట మొదటిసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికవ్వడం పట్ల యుటిఎఫ్ధర్మవరం జోన్ నాయకులు రామకృష్ణ నాయక్, ఆంజనేయులు, లక్ష్మయ్య, అమర్నారాయణ రెడ్డి, రాంప్రసాద్, హరికృష్ణ, బిల్లే రామాంజనేయులు, సాయి గణేష్, రామాంజనేయులు, హరిశంకర్, మేరీవర కుమారి, లతాదేవి, నాగేంద్రమ్మ, రమీజాబీ, నాగిరెడ్డి, జనార్ధన్, కిషోర్, మైనుద్దీన్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు