విశాలాంధ్ర ధర్మవరం : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన సమావేశంలో సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా ధర్మవరం పట్టణానికి చెందిన శెట్టిపి సూర్య ప్రకాష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. హిందూపురం పట్టణానికి చెందిన జిల్లా ఉపాధ్యక్షుడిగా ముక్తియార్ , జనరల్ సెక్రెటరీ రామ్ మోహన్, కదిరి పట్టణానికి చెందిన ఆర్గనైజేషన్ సెక్రటరీ వినోద్ అడ్వైజర్ కమిటీ మెంబర్ గా మల్లికార్జున ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ జిల్లాకు చెందిన అన్ని ప్రైవేట్ మెడికల్ ల్యాబ్ లకు సంబంధించిన సమస్యలు వచ్చిన వాటిని పరిష్కారం చేయుటకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ , సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్స్ సురేంద్ర రెడ్డి, ప్రతాప్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అనిల్, ఇమ్రాన్, అబ్దుల్లా, అంజి , జిల్లాకు చెందిన అన్ని నియోజవర్గాల ల్యాబ్ టెక్నీషియన్స్ పాల్గొన్నారు.
శ్రీ సత్య సాయి జిల్లా ప్రైవేట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా శెట్టిపి సూర్య ప్రకాశ్ రెడ్డి
RELATED ARTICLES