విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవాలయాల్లో శివ దీక్షబూనిన 35 మంది శివస్వాములు బుధవారం శ్రీశైలానికి పాదయాత్రతో తరలి వెళ్లారు. ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీదుల గుండా మేళతాలతో శివనామ స్మరణతో చిన్నారులు కళసాలతో ఊరేగింపుగా తరలి వెళ్లారు. శివస్వాములను బంధువులు శ్రీశైలానికి భక్తి శ్రధ్ధలతో సాగనంపారు.