విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) :వైసీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శిగా పెద్దకడబూరు గ్రామానికి చెందిన ఆర్. శివరామిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవిని అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అందుకు సహకరించిన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి,వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డికి, జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డికి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డికి, మండల నాయకులకు శివరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.