Thursday, February 27, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిభక్తుల సందడిలో శివరాత్రి మహోత్సవ వేడుకలు

భక్తుల సందడిలో శివరాత్రి మహోత్సవ వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని పేట బసవన్న కట్టవీధిలోగల త్రిలింగేశ్వర ఆలయంలో శివరాత్రి మహోత్సవ వేడుకలు భక్తుల సందడిలో వందలాదిమంది భక్తాదుల నడుమ అత్యంత వైభవంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయాన్ని వివిధ పూల లతో అలంకరణ, శివలింగాన్ని వివిధ పూలమాలలతో అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా కట్టుకుంది. అర్చకులు రాఘవ శర్మ వారి శిష్య బృందం వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ శివరాత్రి వేడుకలను భక్తాదులు, దాతలు, కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు విశేష అభిషేకాలు, రుద్రాభిషేకము నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జ్ గీత వాణి కుటుంబ సభ్యులు ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.పురుషోత్తం రెడ్డి దంపతులు దాతగా చండీ హోమమును నిర్వహించారు. భక్తాదులు, దాతల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగిందని అధ్యక్షులు జన్నే వెంకట రమణ, కార్యదర్శి జన్నె సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వందలాదిమంది భక్తాదులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు