Friday, May 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశ్రీ షిరిడి సాయిబాబా రజతోత్సవ వేడుకలు..

శ్రీ షిరిడి సాయిబాబా రజతోత్సవ వేడుకలు..

శ్రీ షిరిడి సాయిబాబా సేవ సమితి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయి నగర్ లో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ షిరిడి సాయినాథ స్వామి విగ్రహ స్థిర ప్రతిష్టాపన జరిగి 25 సంవత్సరాలు జరిగిన శుభ సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ వీరనారాయణ, రామలింగయ్య, సూర్యప్రకాష్, టి సి నారాయణ రెడ్డి, జలదంకి సూర్యనారాయణ, రాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆలయములో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ జూన్ నెల మూడవ తేదీ నుండి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను ప్రధాన పురోహితులు వేదమూర్తి, బ్రహ్మశ్రీ పంచాంగం, నాగ ప్రసాద్ శర్మ వీరి సహచరుల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. జూన్ రెండవ తేదీ గణపతి పూజ ప్రారంభంతో, మూడవ తేదీ గంగ పూజా యాగశాల ప్రవేశం కలసస్థాపన జపములు, గణపతి, దీక్ష హోమం, నాలుగవ తేదీన వేద పారాయణ, నవగ్ర హ, సుబ్రహ్మణ్య, ధన్వంతరి హోమాలు, ఐదవ తేదీన ప్రాణ ప్రతిష్ట స్థాపన, స్వామివారికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, వివిధ హోమాలు, మహా కుంభాభిషేకం, మహా పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. తదుపరి వందల సంఖ్యలో అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మూడవ నూతన దేవాలయముగా శివాలయమును ప్రారంభిస్తున్నామని తెలిపారు. కావున భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు