Friday, April 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆరుగురు జూదరులు అరెస్ట్.. వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్

ఆరుగురు జూదరులు అరెస్ట్.. వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని గాంధీనగర్ రైల్వే కింద వంతెన సమీపంలో బుధవారం రాత్రి జూదమాడుతున్న ఆరుగురు ను అరెస్టు చేసి కోర్టుకు తరలించడం జరిగిందని వన్టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.5,240 నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. పేకాట, మట్కా, జూదం లాంటివి చట్టపరమైనవి కావని, ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేరును గోపెయంగా ఉంచుతామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు