Saturday, May 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు..

ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు..

హెడ్మాస్టర్ ఏపీ మోడల్ స్కూల్ ఆర్. పద్మశ్రీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల ఆదర్శ ఏపీ మోడల్ స్కూల్లో ఇటీవల 2025 -26 సంవత్సరపు ఆరవ తరగతి ప్రవేశం కొరకు ఏప్రిల్ 21వ తేదీన పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేడు పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ పద్మశ్రీ మాట్లాడుతూ ఈ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలలో మొత్తం 265 మంది విద్యార్థులు హాజరుకాగా 136 మంది ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఇందులో అధిక మార్కులు సాధించిన వారిలో టీ. జాహ్నవి 89, జి. కారుణ్య 80, వాణిశ్రీ 80 రావడం జరిగిందన్నారు. ఎంపిక కాబడిన వారికి సమాచారం కూడా పంపడం జరిగిందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు