కోఆర్డినేటర్ హరిప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం : నిరుద్యోగ యువతకు బెంగళూరులో టాళి, కంప్యూటర్ కోర్సులలో నైపుణ్య శిక్షణ ఉద్యోగ అవకాశాలను కల్పించబడును అని కోఆర్డినేటర్ హరిప్రసాద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ‘ఉన్నతి ఫౌండేషన్్ణ ఆధ్వర్యంలో బెంగళూరులో టాలీ మరియు కంప్యూటర్ కోర్సులలో ఉచిత శిక్షణతో పాటు, 100 శాతము ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం మొత్తం 35 రోజుల పాటు బెంగళూరులో జరుగుతుంది అని, శిక్షణా కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. కోర్సులో భాగంగా టాలీ ప్రైమ్ , కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లీష్, లైఫ్ స్కిల్స్ ఇంటర్వ్యూలలో రాణించేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు కూడా అర్హులే అని తెలిపారు.18 ఏళ్ల నుండి 28 ఏళ్ల లోపు వయస్సు ఉండాలన్నారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రం (సర్టిఫికేట్) అందజేయడంతో పాటు, ప్రముఖ సంస్థలలో 100 శాతము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం, అడ్మిషన్ల కొరకు వెంటనే 90004 87423 నంబరులో సంప్రదించగలరు అని తెలిపారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


