Wednesday, January 8, 2025
Homeజిల్లాలుఅనంతపురంస్మశాన సమస్యను పరిష్కరించి కొలతలు వేయించండి

స్మశాన సమస్యను పరిష్కరించి కొలతలు వేయించండి

అనంతపురం జిల్లా

విశాలాంధ్ర-రాప్తాడు గ్రామంలోని స్మశాన వాటిక సమస్యను పరిష్కరించి కొలతలు వేయించాలని తహశీల్దార్ పి.విజయకుమారికి గ్రామస్తులు విన్నవించారు. మంగళవారం గంగలకుంట గ్రామంలో వీఆర్ఓ గీతా ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే దశాబ్దాలుగా ప్రస్తుతమున్న స్మశానంలో ఖననం చేస్తున్నామని, అయితే నిర్ణీత హద్దులు లేకపోవడంతో పక్క పొలాల వారితో ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే పూర్తయిందని అయితే జాయింట్ ఎల్.పి.ఎం నెంబర్లు ఉండడం వల్ల ఆన్లైన్లో వన్-బి, అడంగల్ రావడం లేదన్నారు. భూమి కొలతల్లో తేడాలున్నాయని, సర్వే చేయించాలని మూడు అర్జీలు వచ్చాయి. అదేవిధంగా భూములకు రస్తా హద్దులు చూపించాలని కోరారు. మిగులు భూమికి పట్టా ఇవ్వాలని ఒక అర్జీ వచ్చింది. కార్యక్రమంలో సిఎస్డిటి జ్యోతి, సర్వేయర్ రామాంజనేయులు, కిష్ట, డీలర్ కుంటాల గంగాధర్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు