విశాలాంధ్ర ముదిగుబ్బ : మండల పరిధిలోని మార్తాడు గ్రామంలో నెలకొన్న తమ పొలాలకు వెళ్లే రస్తా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఐ నాయకులు గ్రామ రైతులు బుధవారం సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ నారాయణ స్వామికి వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు, ఆ పార్టీ రైతు సంఘం నాయకులు రాధాకృష్ణ తదితరులతో కలిసి మర్తాడు గ్రామ రైతులు తాసిల్దార్ కు తాము ఎదుర్కొంటున్న రహదారి సమస్యను
వివరించారు.
ఇందుకూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి నుంచి తమగ్రామం మీదుగా పొలాలకు వెళ్లే ఈ రహదారిని
ఆ గ్రామానికి చెందిన గోపాల అనే రైతు ఆక్రమించుకొని దారికి అడ్డుకట్ట వేశాడని వాపోయారు. చాలా ఏళ్లుగా తమ పొలాలకు ఉన్న
ఈ రహదారి రూట్ మ్యాప్ లో అధికారికంగా ఉన్నా కూడా
ఆ రైతు దౌర్జన్యంగా ఆక్రమించుకోవడంతో సుమారు 250 ఎకరాలకు రస్తా లేకుండా పోయిందని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వ్యవసాయ పనుల నిమిత్తం మా పొలాల్లోకి వెళ్ళే అవకాశం లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలిపారు, ప్రస్తుత ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ పనుల్లో భాగంగా రైతులు ఎదుర్కొంటున్న ఈ రహదారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో
ఆ గ్రామ రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమం చేపడతామని సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు తాసిల్దార్ కు తెలియజేశారు, స్పందించిన తాసిల్దార్ త్వరలోనే ఆ రహదారి సమస్యను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పొలాలకు వెళ్లే రస్తా సమస్యను పరిష్కరించండి.. సిపిఐ నాయకులు
RELATED ARTICLES