Monday, January 13, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి..

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి సత్తి కుమార్ యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా కాలమానని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి రామాంజనేయులు యాదవ్ సమస్యలను మంత్రి దృష్టికి వివరించారు. అనంతరం ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు రెండు నూతనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ప్రొహిబిషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువలన రావలసిన బకాయిల్ని ఇవ్వాలని, సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సచివాలయ ఉద్యోగులకు అన్ని రూల్స్ పాటించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జీవో నెంబర్ 423ను వెంటనే రద్దుచేసి, పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు మిగిలిన కార్యదర్శుల పని వేళలు కల్పించాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 143 ,32 జీవోలను రద్దు చేయాలని, సురక్షిత వాచ్మెన్ 24/7 పనిచేసే ఆసుపత్రులలో భద్రత కోసం వాచ్మెన్ నియమించాలని, రెగ్యులర్ ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాలని, ఏఎన్ఎంల రీ డిప్లయ్మెంట్ సీనియర్ ఏఎన్ఎములకు తిరిగి ఉప కేంద్రాలకు పంపాలని తెలిపారు. డాక్టర్ల సంఖ్య పెంచాలని, సామాజిక పారామెడికల్ ఆసుపత్రులలో జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్లను పెంచాలని తెలిపారు. మందుల సరఫరా అన్ని రకాల మందులు రసాయనాలు ప్రభుత్వమే సరఫరా చేయాలని వారు తెలిపారు. డాక్టర్లకు ప్రత్యేక బత్యాలు, పోస్ట్మార్టం ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక బత్యాలు ఇవ్వాలన్నారు. కొత్త పిఆర్సీను కమిటీ ప్రమేయం లేకుండా వెంటనే ప్రకటించాలని కోరుతూ 20 అంశాలపై మంత్రితో చర్చించడం జరిగిందని నాయకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఆదినారాయణ మల్లికార్జున తాలూకా అధ్యక్షులు సాయి ప్రకాష్-ధర్మవరం, కదిరి తాలూకా అధ్యక్షులు ఫక్రుద్దీన్, మడకశిర తాలూకా అధ్యక్షులు నటరాజ్ యాదవ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి హరిప్రసాద్, ధర్మవరం కార్యదర్శి ఓబులేషు, గ్రామపంచాయతీ విభాగం సభ్యులు సుధాకర్, సుబ్రహ్మణ్యం, వీఆర్ఏ అధ్యక్షులు సుధాకర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు