Monday, May 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికార్మికుల సమస్యలను పరిష్కారం చేయండి…

కార్మికుల సమస్యలను పరిష్కారం చేయండి…

ఏపీ వర్కర్స్&ఎంప్లాయిస్
విశాలాంధ్ర ధర్మవరం;కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని ఏపీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్, సిఐటియు మండల కన్వీనర్ జే వి రమణ, కో కన్వీనర్ అయూబ్ ఖాన్, సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాబు ముకుంద లక్ష్మి ఓబులేసు, ఇంజనీరింగ్ కార్మిక సంఘ అధ్యక్షులు నాగరాజు, జయ తెలిపారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నానిర్వహించడం జరిగింది. అనంతరం వారుమాట్లాడుతూ కార్మికులకు. ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్ ఔర్సోర్సింగ్ పద్ధతిని రద్దుచేసి కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని. కనీస వేతనం అమలు చేస్తామని. ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం హామీఇవ్వడం జరిగిందని, కానీ ఎన్నికల తర్వాత కార్మికులకున్న ఆప్కాస్ పద్ధతిని రద్దుచేసి ,కాంట్రాక్టు పద్ధతిని అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అటువంటి ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం జరిగే విధానాలు తీసుకొని వస్తే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని. చనిపోయిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగంఇవ్వాలని ,దాదాపు మూడు సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు అందుకు సంబంధించిన చర్యలు చేపట్టడం లేదని వాపోయారు.చనిపోయిన కార్మిక కుటుంబాలు ఏటువంటి ఉపాధిలేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, అటువంటివారి కుటుంబాల్లోని ఒకరికి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36ను అమలు చేయాలని వేతనాలు పెంచాలని, కోవిడ్ సందర్భంగా తీసుకున్న అడిషనల్ వర్కర్స్ కు ఆప్కాస్ కార్మికులతో పాటు వేతనాలు మంజూరు చేయాలని తెలిపారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కార్మికులకు అందరికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఆప్కాస్ విధానాన్ని రద్దుచేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులను అందరినీ రెగ్యులర్ చేయాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అదేవిధంగా ఫర్మనేంట్ కార్మికులకు ఉన్నటువంటి పలురకాల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కారం చేయాలని తెలిపారు. అనంతరం డిమాండ్లతో కూడిన సమస్యలనువినతి పత్రంగా మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కి అందజేశారు. స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ మీ సమస్యలను జిల్లా అధికారులకు ప్రభుత్వ దిష్టికి తీసుకుని వెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు