Monday, April 7, 2025
Homeజిల్లాలుకర్నూలుసోమన్న "బడి అమ్మ ఒడి" పుస్తకావిష్కరణ

సోమన్న “బడి అమ్మ ఒడి” పుస్తకావిష్కరణ

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న 67వ పుస్తకం “బడి అమ్మ ఒడి” పుస్తకావిష్కరణ హైదరాబాద్ లోని తాజ్ మహల్ హోటల్ లో సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు డా.కె.లక్ష్మణ్ ,వాల్మీకి సాహిత్య,సాంస్కృతిక సేవా సంస్థ గౌరవాధ్యక్షులు,విశ్రాంత భూగర్భ గనుల శాఖ అధికారి డా.వి.డి.రాజగోపాల్, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య శ్రీ టి.గౌరీ శంకర్ , విశ్రాంత అటవీశాఖ అధికారి శ్రీ ఏ.ఎల్.కృష్ణారెడ్డి ,అధ్యక్షులు డా.వి.యస్.రావు చేతుల మీదుగా శ్రీరామ నవమి సందర్భంగా ఆవిష్కరించారు.అనంతరం జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న,అచిర కాల వ్యవధిలో 66 పుస్తకాలు రచించి,పలు చోట్ల వాటిని ఆవిష్కరించిన గద్వాల సోమన్న అవిరళ కృషిని గుర్తించి సత్కరించారు.సన్మాన గ్రహీత, కృతికర్త గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు