Friday, April 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం గ్రామీణ ఎస్సీ లకు ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక రుణాలు

ధర్మవరం గ్రామీణ ఎస్సీ లకు ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక రుణాలు

– వెంటనే దరఖాస్తు చేసుకోండి.. ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని గ్రామీణ ఎస్సీ కులములకు ఆర్థిక స్వవలంబన కోసం ప్రత్యేక రుణాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ధర్మవరం గ్రామీణ ప్రాంతంలోని షెడ్యూల్డ్ కులాల ఆర్థిక స్వావలంబనను పెంపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. “స్వర్ణ ఆంధ్ర @ 2047” లక్ష్యంలో భాగంగా 2047 నాటికి $2.4 ట్రిలియన్ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి సాధించేందుకు, ధర్మవరం గ్రామీణ ప్రాంతంలోని ఎస్సీ వర్గాల జీవనోపాధిని మెరుగుపరచడం, ఆదాయ వనరులను పెంచడం ద్వారా వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది అని తెలిపారు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 32 విభిన్న పథకాలలో రుణాలు అందించబడుతున్నాయి అని, చిన్న వ్యాపారాలు, వ్యవసాయం, విద్య, నైపుణ్యాభివృద్ధి రవాణా వంటి రంగాలలో ఎస్సీ లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడతాయని, ఈ రుణాలు తక్కువ వడ్డీ రేట్లకు మరియు సరళమైన తిరిగి చెల్లింపు నిబంధనలతో అందుబాటులో ఉంటాయి అని తెలిపారు.లబ్ధిదారుడు షెడ్యూల్డ్ కులాల వర్గానికి చెందిన వారై ఉండాలి అని,
లబ్ధిదారుని వద్ద కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి అని తెలిపారు.
లబ్ధిదారుని వయస్సు 21 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి అని,
లబ్ధిదారుడు దారిద్య్ర రేఖకు దిగువన (బిపిఎల్) వర్గానికి చెందిన వారై ఉండాలి అని తెలిపారు.స్వయం ఉపాధి పథకాలలోని రవాణా రంగం కోసం లబ్ధిదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అని, జెనరిక్ ఫార్మసీ పథకాల కోసం లబ్ధిదారుడు డి ఫార్మసీ లేదా బీఫార్మసీ లేదా ఏం ఫార్మసీ కలిగి ఉండాలని తెలిపారు. మే నెల పదో తేదీ వరకు గడువు ఉందని, దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని లేదా సమీపంలోని సచివాలయం లేదా మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.ధర్మవరం గ్రామీణ ప్రాంతంలో ఈ పథకం కింద ఎస్సీ వర్గానికి 9 రుణాలు మంజూరు చేయబడుతాయి అన్నారు. కావున అర్హులైన వారందరూ కూడా తమ జీవన నాణ్యతను రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేలా సహకార అందించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు