Tuesday, May 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

అర్చకులు చంద్రకాంత ఆచార్యులు, శ్రీనివాసచార్యులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని చెరువు కట్ట వీధి వద్ద గల జీవి ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలను అర్చకులు చంద్రకాంతచార్యులు, శ్రీనివాసాచార్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా సింధూరంతో కుంకుమతో పుష్పములతో ప్రత్యేక అర్చనలు పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వేడుకల్లో భాగంగా విజయవంతం కావుటకు ఈ పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్వామివారి సింధూరం, కుంకుమ, వివిధ పూలమాలలతో అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు