Friday, April 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘాను ఉంచాలి..

అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘాను ఉంచాలి..

శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్న
విశాలాంధ్ర ధర్మవరం;; అసాంఘిక కార్యకలాపాలపై వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల సిఐలు ,ఎస్సైలు ప్రత్యేక నిఘాను తప్పనిసరిగా నిర్వహించాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లోని లాకప్ గదులు ఉమెన్ హెల్ప్ డెస్క్ రికార్డుల నిర్వహణ లాకప్ గదులను పోలీస్ స్టేషన్ పరిసరాలను వారు పరిశీలించారు. తదుపరి స్టేషన్ పరిధిలోని శాంతి భద్రత గురించి ఎస్సై అండ్ సీఐల ద్వారా ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు వచ్చే ప్రజలను గౌరవంగా పలకరించాలని తెలిపారు. సమస్యలు ఉత్పన్నం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణ మరికొంత ఫలితాలు ఉండే విధంగా చూడాలన్నారు
దీర్ఘకాలిక ఉన్న కేసులను వారు పరిశీలిస్తూ, త్వరితగతిన వీటిని పరిష్కరించే దిశలో చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు. రాత్రిపూట బీట్లు మండల పరిధిలోని పల్లెలలో పల్లెనిద్రలు తప్పనిసరిగా చేపట్టాలని, పెట్రోలింగ్ ముమ్మరం చేస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు గైకొనాలని తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరాలు పట్ల ప్రజలకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించాలని సూచించడం జరిగిందన్నారు. మట్కా పేకాట గంజాయి నాటు సారా తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా విధులను నిర్వర్తించారని తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిగా చేపట్టాలని కూడా సూచించడం జరిగిందని తెలిపారు. అనంతరం ధర్మవరం పట్టణ శివారు ప్రాంతాలలో డ్రోన్లతో నిఘా వేయగా ఈవ్ టీచింగ్, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్ పై దృష్టి సారించడంతో డ్రోన్ల ద్వారా పరిశీలించి ఐదు మంది పైన ఓపెన్ డ్రింకింగ్ కేసులను కూడా బుక్ చేయడం జరిగిందని తెలిపారు. ఈనెల 22వ తేదీన ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయాన్ని కూడా వారు ఆరా తీసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించడం కూడా జరిగింది. మృతి పై అన్ని కోణాలలో విచారణ చేపట్టాలని, త్వరలో ఈ కేసును చేదించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు