విశాలాంధ్ర -ధర్మవరం:: క్రీడలు శరీర దృఢత్వాన్ని ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ముఖ్యఅతిథిగా విచ్చేసిన సందారాఘవ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర హాకీ పోటీ కార్యక్రమానికి టిడిపి నాయకుడు సందా రాఘవ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వీరితో పాటు వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, పళ్లెం వేణుగోపాల్, ఉడుముల రామచంద్ర, కలవల మురళీధర్ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ముఖ్య అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులకు ముఖ్య అతిథులు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అనంతరం హాకీ ఏపీ స్టేట్ ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్ మాట్లాడుతూ హాకీ క్రీడలను జాతీయ స్థాయికి తెచ్చేందుకు విశేష కృషితో ముందుకు వెళుతున్నామని తెలిపారు. రెండవ రోజున హాకీ క్రీడా పోటీల్లో ప్రకాశం-అనంతపురం తరపడగా అనంతపురం మూడుగోళ్లతో విజయం, విశాఖపట్నం-ఏలూరు తడపడగా విశాఖపట్నం 8 గోల్తో విజయం, కడప- ఎన్టీఆర్ తరపడగా ఏడుగోలుతో కడప విజయం, అన్నమయ్య-గూడూరు తలపడక అన్నమయ్య ఆరు గోల్ తో విజయం, అనకాపల్లి- వెస్ట్ గోదావరి తలపడగా అనకాపల్లి 6 గోల్తో విజయం, ఏలూరు- శ్రీకాకుళం తెలపడగా శ్రీకాకుళం విజయం, కాకినాడ- చిత్తూరు తలపడగా కాకినాడ 6 గోల్తో విజయం, సత్యసాయి జిల్లా- బాపట్ల తరపడగా సత్య సాయి జిల్లా 2 గోల్తో విజయం, నంద్యాల- అనంతపురం తలపడగా అనంతపురం ఐదు గోల్ తో విజయం సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గౌరీ ప్రసాద్ , కోశాధికారి అంజన్న, హాకీ క్రీడాకారులు, ఫిజికల్ డైరెక్టర్లు, హాకీ అభిమానులు పాల్గొన్నారు
క్రీడలు శరీర దృఢత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.. ముఖ్యఅతిథి సందా రాఘవ
RELATED ARTICLES