విశాలాంధ్ర- ధర్మవరం: వధాన్య జన సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే గణిత టాలెంట్ టెస్ట్ లో ధర్మవరానికి చెందిన శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శ్రీ సత్య సాయి జిల్లా మొదటి స్థానంతో పాటు టాప్ 10 లోపు ఐదు స్థానాలను కైవసం చేసుకోవడం జరిగిందని హెడ్మాస్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాలకు చెందిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ఎం.నరసింహులు,మొదటి ర్యాంకు (రూ.25,000 నగదు బహుమతి),
ఎస్.కరీముల్లా, ఆరవ ర్యాంకు ( రూ.7500 నగదు బహుమతి) ,
కె. గౌతం కృష్ణ, ఏడవ ర్యాంకు ( రూ.7500 నగదు బహుమతి),
కె. విష్ణువర్ధన్, 9వ ర్యాంకు ( రూ.5000 నగదు బహుమతి, జి.రెడ్డి చరణ్ దేవా, పదవ ర్యాంకు10th ( రూ.5000 నగదు బహుమతి) చొప్పున వదాన్య జన సొసైటీ ప్రతినిధులు అనంతపురం పంగల్ రోడ్ లోని ఆర్ డి టి పాఠశాల నందు జరిగిన కార్యక్రమంలో బహుమతులు ప్రధానం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ, తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
టాలెంట్ టెస్ట్ లో శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
RELATED ARTICLES