భక్తులను ఆకట్టుకున్న వీరభద్ర వేషధారి విన్యాసాలు
విశాలాంధ్ర- అనంతపురం : శ్రీ జగజ్యోతి బసవేశ్వరుల జయంతి వేడుకలను అఖిల భారత వీరశైవ మహాసభ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి, జిల్లా వీరశైవ సమాజం అధ్యక్షులు ఎం. జి. రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం టవర్ క్లాక్ దగ్గర, ప్రియదర్శిని హెూటల్ ఎదురుగా ఉన్న జగద్గురు, సంఘ సంస్కర్త, మహాత్మ శ్రీ బసవేశ్వరస్వామి వారి విగ్రహానికి వీరశైవ సమాజం సభ్యులు పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం జగజ్యోతి మహాత్మ శ్రీ బసవేశ్వర స్వామి వారి ఛాయాచిత్ర పట్టాన్ని మేళ తాళాల నడుమ ఊరేగింపుగా స్థానిక టవర్ క్లాక్ నుంచి సుభాష్ రోడ్డు, లలితకళా పరిషత్, సప్తగిరి సర్కిల్, పాతవూరు ఐరన్ బ్రిడ్జి మీదుగా శ్రీ పేట బసవేశ్వరస్వామి దేవాలయం వరకు వీరభద్ర విన్యాసాలు, నందికొళ్ళు ప్రదర్శన ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా వీరశైవ సమాజ గౌరవాధ్యక్షులు ఎల్ నాగన్న, ప్రధాన కార్యదర్శి గౌళి సతీష్ కుమార్, కోశాధికారి జి. మల్లికార్జున, మఠం తిప్పేస్వామి బి.ధనుంజయ బాబు, బి సుశీల, ఎం ఇందిరా, లింగేశ్వరి, జి.చంద్రశేఖర్, గౌలి బిదుకార్ గంగాధర్, ఏసీ నాగార్జున, జి వీరేష్ , సి రవికుమార్, శివకోటి రాంభూపాల్, చిరంజీవి, విజయ్ కుమార్ చౌదరి, బి. సుదేవ్ తదితరులు పాల్గొన్నారు.