Friday, April 18, 2025
Homeజిల్లాలుఅనంతపురంఇంటర్ ఫలితాల్లో శ్రీ సాయి సిద్ధార్థ కళాశాల విద్యార్థిని ప్రతిభ

ఇంటర్ ఫలితాల్లో శ్రీ సాయి సిద్ధార్థ కళాశాల విద్యార్థిని ప్రతిభ

విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా ) : ఇంటర్మీడియట్ ఫలితాలలో శ్రీ సాయి సిద్ధార్థ కళాశాల విద్యార్థిని ఆర్కాట్ మెహెక్ సుల్తానా స్టేట్ ఫస్ట్ సాధించి ప్రతిభ కనబరిచిందని కళాశాల డైరెక్టర్ ఎ. నాగభూషణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ద్వితీయ సంవత్సరం ఫలితాలలో పట్టణంలోని పుట్లూరు రోడ్డు, సంజీవ్ నగర్ జీరో రోడ్ లో ఉన్న శ్రీ సాయి సిద్ధార్థ కళాశాల విద్యార్థిని ఆర్కాట్ మెహెక్ సుల్తానా 992/1000 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు. మెహెక్ సుల్తానా తండ్రి షామిర్ బాషా, పుట్లూరు మండలం, చాల వేముల ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్నారు. మెహెక్ సుల్తానా తల్లి కలీ మున్నీసా, పట్టణంలోని ప్రైవేటు పాఠశాల ఉపాద్యాయురాలిగా పనిచేస్తున్నారు. మెహెక్ సుల్తానా బీటెక్ ఇంజినీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ విద్యనుభ్యసిస్తానని చెప్పింది. అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థిని, తల్లిదండ్రుల సమక్షంలో కళాశాల ప్రిన్సిపాల్ జి. శ్రీనివాస రావు, వైస్ ప్రిన్సిపాల్ వి.రాజశేఖరరెడ్డిలు ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు