శ్రీ సత్య సాయి సేవా సమితి.. సుబ్బదాసు భజన మందిరం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 250 మంది రోగులకు శ్రీ సత్య సాయి సేవ సమితి-సుబ్బదాసు భజన మందిరం-పిఆర్టి సర్కిల్ వారు పాలు, బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దాతగా పొలమడ సుబ్రహ్మణ్యం,రాగిణి దంపతులు వ్యవహరించడం పట్ల వారు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సుల మేరికే ఇటువంటి సేవా కార్యక్రమాలను తాము నిర్వహించడం మాకెంతో సంతృప్తిగా, మనశ్శాంతిగా ఉందని తెలిపారు. అనంతరం పాడేరుకు రైలులో వెళ్ళు సాయి సేవాదళ్ సభ్యులకు 40 మంది కు భోజన వసతిని కూడా తాము కల్పించడం జరిగిందని తెలిపారు. దేశంలోని నలుమూలల పుట్టపర్తి భక్తాదులు ప్రతిరోజు వయా ధర్మారం నుండి పుట్టపర్తికి వెళుతుంటారని, అలాంటప్పుడు ధర్మవరంలో తమ శ్రీ సత్యసాయి సేవా సమితి తరఫున పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. స్టేషన్ మాస్టర్ నరసింహనాయుడు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న సేవలు అనన్యమైనవని, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రతి వ్యక్తి దైవభక్తితో పాటు సేవ ను కూడా అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 20 మందికి పైగా సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పాలు, బ్రెడ్డు, బిస్కెట్లు పంపిణీ
RELATED ARTICLES