విశాలాంధ్ర- ధర్మవరం ; పేద ప్రజలందరికీ కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క లక్ష్యము అని క్లబ్బు అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ, కోశాధికారి సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు సాంస్కృతిక మండలి లో ఈ నెల 11న నిర్వహించబడే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం యొక్క కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణములోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల) వద్ద ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ శిబిరం రోటరీ క్లబ్-మిడ్ టౌన్, శంకర కంటి ఆసుపత్రి-బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ- శ్రీ సత్యసాయి జిల్లా వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిర దాతలుగా కీర్తిశేషులు అస్వర్తమ్మ జాపకార్థం భర్త- వెంకటేశులు, కోడలు- పావని, కుమారుడు- శ్రీధర్ బాబు వ్యవహరిస్తారని తెలిపారు. ఈ శిబిరంలో కంటి ఆపరేషన్లకు ఎంపికైన వారిని ఉచితంగా శంకర కంటి ఆసుపత్రి బెంగళూరుకు తీసుకొని వెళ్లి, రాను, పోను రవాణా చార్జీలు, ఉచిత భోజన వసతి, రోటరీ భరిస్తుందని తెలిపారు. ఆపరేషన్ తదుపరి ఉచితంగా అద్దాలు కూడా పంపిణీ చేయబడునని తెలిపారు. కంటి నిపుణులు సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. కంటి పరీక్షలకు వచ్చేవారు ఆధార్ కార్డు, లేదా రేషన్ కార్డు తో పాటు మీ ఫోన్ నెంబర్, మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తో చిరునామాతో రావాలని తెలిపారు. అదేవిధంగా బీపీ షుగర్ ఎక్కువ ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకొని తగ్గించుకొని వస్తే, కంటి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండయ్య, సత్రశాల ప్రసన్నకుమార్, బివి. చలం తదితరులు పాల్గొన్నారు.