Wednesday, April 23, 2025
Homeజిల్లాలుఅనంతపురంఅనంత జిల్లాలో ఎస్టీ పోస్టులు పెంచాలి

అనంత జిల్లాలో ఎస్టీ పోస్టులు పెంచాలి

ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుల కావలి కోట్రేష్ డిమాండ్

విశాలాంధ్ర అనంతపురం: అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఎస్జిటి పోస్ట్లు పెంచాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుల కావలి కోట్రేష్ డిమాండ్ చేశారు. . బీపీఈడి నాలుగవ సెమిస్టర్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు డీఎస్సీలో అవకాశం కల్పించాలని అనంతపురం కలెక్టర్ ముందు బుధవారం ఎస్జిటి బీపీఈడి అభ్యర్థులతో అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు కావలి కోట్రేష్ మాట్లాడుతూ యువగళం పాదయాత్ర సమయంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 28,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మెగా డీఎస్సీ తో 16,347 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. అందులో అనంతపురం జిల్లా శ్రీకాకుళం ప్రకాశం జిల్లాలో ఎస్జిటి ఉద్యోగాలు ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం అనంతపురం 202 పోస్టులు మిగతా జిల్లాలకు అరకోరగా కేటాయిస్తూ పూర్తిస్థాయిలో ఎస్జిటి పోస్టులు భర్తీ చెయ్యకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎస్జిటి పోస్టులు తక్షణమే పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. బీపీఈడి అభ్యర్థులు మూడవ సెమిస్టర్ నాలుగో సెమిస్టర్ పూర్తి చేసుకున్న వారికి గత 2008 కాంగ్రెస్ ప్రభుత్వంలోన 2018 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోన బిపిఈడి అభ్యర్థులకు వ్రాసుకోవడానికి అవకాశం కల్పించాలన్నారు. కానీ ఆ వేసులపాటును బీపీఈడీ అభ్యర్థులకు కల్పించడంలో విఫలం చెందింది తక్షణమే వారికి న్యాయం చేయాలన్నారు. గతంలో ఆన్లైన్ నార్మలైజేషన్ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించడంతో సంవత్సరాలకొద్దీ చదివిన విద్యార్థుల కంటే రెండు రోజులు చదివిన విద్యార్థులకు అత్యధిక మార్కులు రావడం జరిగిందన్నారు. తక్షణమే నార్మలైజేషన్ ని తొలగించాలని డిమాండ్ చేశారు. రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు బుక్స్ ను రివిజన్ చేయవలసి ఉండగా వాటిని ఇది విజయం చేయాలంటే కనీస సమయం 90రోజుల కావాల్సి ఉంటే కేవలం 45 రోజుల సమయాన్ని ఇచ్చి కనీసం పాఠ్యపుస్తకాలను రివిజన్ చేసుకోవడానికి కూడా సరిపోని సమయాన్ని కేటాయించారన్నారు. దీనివల్ల నిరుద్యోగులు తీవ్ర నష్టపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. బిఎడ్ తో పట్టు డిగ్రీ చదివిన జనరల్ కేటగిరి అభ్యర్థులు 50% ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 45% ఉంటే డీఎస్సీ పోస్టులకు అప్లై చేసుకోవాలని తెలియజేస్తే కేవలం 1% లేదా 2% ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అన్నారు. పాత విధానం ద్వారానే డీఎస్సీ కొనసాగించాలని అభ్యర్థుల పక్షాన తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఎక్కడెక్కడ చదివారు దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు అడగడం జరిగిందన్నారు. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురి అవుతున్నారన్నారు. అభ్యర్థికి సంబంధించిన సమాచారాన్ని సిస్టంలో ఎంటర్ చేసిన చివరికి ఫీజు చెల్లించే విషయంలో అసలు ఫీజు చెల్లించడానికి కూడా సిస్టం లో ఆప్షన్ కనిపించక లేనిపోని ఆప్షన్ల వల్ల అభ్యర్థులు సక్రమంగా ఆన్లైన్లో నమోదు చేసుకోలేకపోతున్నారు అని పేర్కొన్నారు. ఇన్నీ సమస్యల ఉండగా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం అన్నీ అర్ధాంతరంగా నోటిఫికేషన్ వెల్లడించారన్నారు. కానీ సమస్యలు పరిష్కరించడంలో అభ్యర్థులకు సమస్యలను నివృత్తి చేసే విధంగా కనీసం ఒక హెల్ప్ లైన్ కూడా పెట్టని పరిస్థితి తక్షణమే డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎస్జిటి పోస్టులు పెంచే విధంగా అభ్యర్థుల వయోపరిమితి అదేవిధంగా పరీక్షా సమయానికి 90 రోజుల సమయాన్ని ఆన్లైన్ నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. బిఎడ్ డిగ్రీ అభ్యర్థులకు 50% 45% ఉంటే అప్లై చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం దారుణం వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులను కలుపుకొని దశలవారీగా ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమిప్ప ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ, . డివైఎఫ్ఐ నూరుల్లా, జిల్లా కోశాధికారి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి ధనుంజయ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుమార్ నాయక్, విఎన్ఐవి టిపి రామన్న, ఏఐవైఎఫ్ జిల్లా సమితి సభ్యులు రాంబాబు డీఎస్సీ అభ్యర్థులు రమేష్,కిరణ్, ఆంజనేయులు, కళ్యాణ్ తదితరుల పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు