అంటిపేట,గుచ్చిమి రైతుసేవాకేంద్రాల సందర్శన
తామరకండిలో ధాన్యంమిల్లుతనిఖీ
జిల్లాలో ధాన్యం కొనుగోలు పైన డబ్బులు చెల్లింపులు పై సంతృప్తి వ్యక్తం చేసిన ఎండి
ఎండికు ఘన స్వాగతం పలికిన జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, జిల్లా మండల అధికారులు, రైస్ మిల్లర్లు
ఎండిను ఘనంగా సత్కరించిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్
విశాలాంధ్ర, సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలో రాష్ట్ర పౌరసరఫరాల మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలాని బుధవారంనాడు సుడిగాలి పర్యటన చేపట్టారు. ముందుగా అంటిపేట రైతు సేవాకాంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలుపైన, తేమశాతం నమోదు, రైతులకు డబ్బులు చెల్లింపులు, ఇటీవల కురిసిన చిరుజల్లులకు,మబ్బులకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపైన ధాన్యంసేకరణపై ప్రశ్నలు వేశారు. క్షేత్రస్థాయిలో రైతులగూర్చి కూడా పలు ప్రశ్నలు వేశారు. రైతుసేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందా లేదా అని ప్రశ్నించారు. అదనంగా దాన్యము తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. రైతు సేవ కేంద్రాల సేవలపై కూడా ఆరా ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందా లేదన్న అంశాన్ని కూడా తెలుసుకున్నారు.జిల్లాలో ధాన్యం కొనుగోలు కొనుగోలు అనంతరం రైతులకు డబ్బులు చెల్లింపులు పైన, తేమశాతం పైన, రైతు సేవా కేంద్రాల ఆధ్వర్యంలో జరుగుతున్న విధానాలపై ఆయన సంతృప్తి చెందారు. 24 గంటల్లోగా డబ్బులు తమ ఖాతాలో జమ అవుతున్న విషయాన్ని రైతులు తమ సెల్ఫోన్లో మెసేజ్ ద్వారా చూపించారు. పక్కజిల్లాలో ఉండే ఫిర్యాదులపై గుచ్చిగుచ్చి ప్రశ్నించినప్పటికీ ఈజిల్లాలో లేకపోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.జిల్లాలోని జిల్లాలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్లు, ఇతర అధికారులంతా సమన్వయంతో పని చేస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభికవివరించారు. ఈఎడాది ధాన్యంలో రైతు నేరుగా మిల్లును కూడా ఎంచుకునే పద్ధతిని ఏర్పాటు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఇస్తుందని రైతులు తెలిపారు. మిల్లర్లు కూడా పూర్తి సహకారం అందిస్తామని, 100 కోట్ల రూపాయలు బ్యాంకు గ్యారంటీ కడతామని తెలియజేశారు. జిల్లా అధికారుల సహకారంతోపాటు రైతులు మంచి ధాన్యాన్ని ఈఏడాది మిల్లులకు తీసుకొని వస్తున్నారని తెలిపారు. జిల్లాలో 24 గంటల్లోపు ఇంతవరకు ధాన్యం తరలించారు రైతులకు డబ్బులు పడుతున్నాయని రైతులతో పాటు అధికారులు కూడా ఆయనకు తెలియజేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు డబ్బులు చెల్లింపులు రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం సేకరణ తదితర అంశాల పట్ల ఎండి సంతృప్తి వ్యక్తం చేశారు. చివరివరకు ఇదేపందాను కొనసాగించాలన్నారు. రైతులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాకు మొదటిసారిగా విచ్చేసిన ఎండిమంజీర్ జిలానీకు జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభికా, సబ్ కలెక్టర్ శ్రీ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారులు, మండల అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ తో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ పాల్, జిల్లా పౌరసరఫరాల అధికారి పి .శ్రీనివాసరావు, జిల్లా మార్క్ ఫెడ్ అధికారి వై విమల, తహాశీల్దార్
అల్లువాడ ఉమామహేశ్వర రావు, మండల వ్యవసాయ అధికారి ఎస్ అవినాష్, సిఎస్డిటి రమేష్ ,తదితరఅధికారులు, గ్రామ సచివాలయాల వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవిన్యూ అధికారులు,రైతులు పాల్గొన్నారు.తామరఖండిలోని శ్రీవెంకట సూర్య మోడరన్ రైస్ మిల్లును సందర్శించిన సమయంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఘనస్వాగతం పలికి ఆయనకు సన్మానించారు. తమ సమస్యలను పరిష్కరించాలని, 1:4 బ్యాంకు గ్యారంటీ సదుపాయాన్నీ కల్పించాలని, గతంలో రావలసిన బకాయిలు చెల్లింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తి సహకారం అందజేస్తామని, 100 కోట్ల బ్యాంకు గ్యారెంటీ కూడా కడతామని మిల్లర్లు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు తమతో సమావేశాన్ని నిర్వహిస్తూ ధాన్యం సేకరణపై బ్యాంకు గ్యారంటీలపై అప్రమత్తం చేస్తూ తమను చైతన్యం చేస్తున్నారని తెలిపారు.ఈకార్యక్రమంలో రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు బి .రవి కుమార్ మాస్టర్, ట్రెజరర్ గెంబలి రవికుమార్, వైస్ ప్రెసిడెంటులు ఎం.ధనుంజయనాయుడు, అక్కేనమధు కన్వీనర్ పొట్నూరు గౌరీ శంకర్రావు
కె వెంకటరాజు, వారణాసి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పౌరసరఫరాల మేనేజింగ్ డైరెక్టర్ జిలాని పర్యటన ప్రశాంతంగా ముగియడంతో జిల్లాఅధికారులు, మండలఅధికారులు మిల్లర్లు ఊపిరి పీల్చుకున్నారు.
సీతానగరం మండలంలో రాష్ట్ర పౌరసరఫరాల ఎండి మంజీర్ జిలానీ సుడిగాలి పర్యటన
RELATED ARTICLES