Monday, April 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రారంభమైన రాష్ట్ర హాకీ పోటీలు

ప్రారంభమైన రాష్ట్ర హాకీ పోటీలు

టర్ఫ్ కోర్టు త్వరలో నిర్మిస్తాను.. ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో ఈ నెల ఆరవ తేదీ నుంచి 9వ తేదీ వరకు 15 వ ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ హాకీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. తొలుత క్రీడాకారులతో గౌరవ వందనం స్వీకరించారు. హాకీ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా విచ్చేసిన క్రీడాకారులకు ఇరువురు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమని తెలిపారు. మన ధర్మారంలో రాష్ట్రంలోని హాకీ క్రీడా కారులను ఒక చోటికి చేర్చి పోటీ నిర్వహించడం నిజంగా గర్వించదగ్గ విషయమని నిర్వాహకులను అభినందించారు. ఊక అశ్వత్త నారాయణ మెమోరియల్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషించదగ్గ విషయం అని తెలిపారు. ముఖ్య అతిథులుగా మంత్రితోపాటు, చిలక మధుసూదన్ రెడ్డి, తదుపరి ఏపీ స్టేట్ ఉపాధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్, స్టేట్ అధ్యక్షులు చానుక రాజు, స్టేట్ కార్యదర్శి హర్షవర్ధన్, స్టేట్ కోశాధికారి థామస్, సౌత్ రైల్వే ఆఫీసర్ కత్తి గీతారెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం ఒకటవ రోజు జరిగిన హాకీ పోటీలు వివరాలను నిర్వాహకులు తెలుపుతూ చిత్తూర్-కాకినాడ తరపడగా 10 గోల్తో కాకినాడ విజయం, ప్రకాశం-నంద్యాల తలపడగా ఐదు గోల్తో ప్రకాశం విజేత, విశాఖపట్నం-శ్రీకాకుళం తో తలపడగా శ్రీకాకుళం 3.2 గోల్తో విజేత, అన్నమయ్య-మాన్యం తలపడగా అన్నమయ్య 5 గోల్తో విజేత, తిరుపతి-నెల్లూరు తలపడగా తిరుపతి ఐదు కోల్ తో విజేత, అనకాపల్లి-వెస్ట్ గోదావరి తలపడగా రెండు గోల్తో అనకాపల్లి విజేత, కడప-కర్నూలు తలపడగా 12 గోలుతో కడప విజేత గా నిలిచారు. ఈ హాకీ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 22 టీములకు 440 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. మొదటిరోజు హాకీ పోటీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాల అందించిన అందరికీ కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు